ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మళ్లీతెరపైకి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై మళ్లీ కదలిక వస్తోంది. ఒకటి రెండు రోజుల్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకటీ రెండు రోజుల్లోనే నోటిఫికేషన్ జారీకి కార్యచరణ మొదలు పెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ మేరకు కొత్త జిల్లా ఏర్పాటు ప్రక్రియను త్వరలోనే ఆరంభించనున్నట్లు తెలుస్తోంది.













