ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ .. ఏ కారణం చేతనైనా అందని వారికి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. ఏదైనా కారణం చేతనైనా వివిధ సంక్షేమ పథకాలను అందుకోలేక మిగిలిపోయిన అర్హులకు కూడా లబ్ది చేకూర్చారు. ఈ క్రమంలో వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేశారు. ఈ నేపథ్యంలో 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని 2,62,169 మంది అర్హులకు రూ.216.34 కోట్లను సీఎం అందజేశారు. ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు. దీంతో పాటు ఇదే సమయానికి సంబంధించి కొత్తగా అర్హత పొందిన మరో 1,49,875 మందికి పెన్షన్లు, 4,327 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 2,00,312 మందికి రేషన్ కార్డులు, 12,069 మందికి ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఏ కారణం చేతనైనా పథకాలు లబ్ధి అందని వారికి కూడా అందజేస్తున్నాం. అధికారమంటే అజమాయిషీ కాదు. ప్రజల పట్ల మమకారం చూపడం, కొత్త పెన్షన్, బియ్యం, ఆరోగ్యశ్రీకార్డులు అందజేస్తున్నాం. పెన్షన్ల సంఖ్య మొత్తం 64 లక్షల 27 వేలరకు చేరుకుందన్నారు.













