టీటీడీ ఆస్తుల విక్రయానికి బ్రేక్
దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్తుల విక్రయ వ్యవహారాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని దీనిపై పున సమీక్ష చేయాలని టీటీడీని ఆదేశించింది. మతపెద్దలు, భక్తులతో మాట్లాడి ఆ భూములను ఆలయాల నిర్మాణం, ధర్మప్రచారం, మతపరమైన కార్యక్రమాల వంటి వాటికి వినియోగించుకోవచ్చేమో పరిశీలించాలని సూచించింది. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునేవరకు ఆస్తుల విక్రయాలను నిలిపివేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 50 ఆస్తుల విక్రయానికి సంబంధించి 2016 జనవరి 30న అప్పటి టీటీడీ పాలకవర్గం చేసిన తీర్మానం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, భక్తుల మనోభావాల దృష్ట్యా దానిని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.













