సిన్సినాటీ వర్సిటీతో ఏపీ ఒప్పందం !
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నవ్యాంధ్ర విద్యా రంగాన్ని తీర్చిదిద్దే క్రమంలో అమెరికాకు చెందిన ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీతో పలు ఒప్పందాలు చేసుకునే దిశగా ముందుకెళ్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. పరిశోధన, సైబర్ సెక్యూరిటీ, పరిశ్రమల డిజైన్ తదితర రంగాల్లో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునే దిశగా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆ వర్సిటీలో చదువుకునే ఏపీ విద్యార్థులకు ఫీజు రాయితీ అందేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.













