ఏపీలో మరో కొత్త జిల్లా!
ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. గిరిజన ప్రాంతాలు కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్ని నాన్ని చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. మచిలీపట్నంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని మంత్రి కొత్త జిల్లా ఏర్పాటుపై మాట్లాడారు. ఆదివాసీ ప్రాంతాలన్నీ ఒకే జిల్లాగా ఉండాలనేది సీఎం జగన్ ఆలోచనని తెలిపారు. రానున్న రోజుల్లో ఆదివాసీ ప్రాంతాలను కలిసి ఒకే జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. పాలనను సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నామన్నారు. రంపచోడవరం, పోలవరం ముంపు గ్రామాలతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పేర్ని నాని తాజా వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి.













