ఏపీలో కొత్తగా సబ్ డిస్ట్రిక్ట్ లు..తక్షణమే అమల్లోకి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల రీసర్వే అనంతరం పాలన, పౌర సేవలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా చేపట్టేలా కొన్ని జిల్లాల్లో కొత్తగా సబ్ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అనకాపల్లి, చిత్తూరు, కృష్ణా, పార్వతీపురం, మన్యం, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, కడప, కోనసీమ, ఏలూరు కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో సబ్ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తరపున నోటిఫికేషన్ జారీ అయ్యింది. తక్షణమే ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. కొత్తగా ఏర్పాటు చేసిన సబ్ డిస్ట్రిక్ట్‌లలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటవుతాయని ప్రభుత్వం పేర్కొంది. అలాగే కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌లలోని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజిస్ట్రేషన్ల చట్టం 1908లోని సెక్షన్ 5 ప్రకారం ఈ కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌ల పరిధిలోకి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నోటిఫికేషన్లో పేర్కొన్న గ్రామాలు ఇక నుంచి కొత్త సబ్ డిస్ట్రిక్‌ల పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ సేవల కోసం గ్రామ సచివాలయాల పరిధిలో కూడా నోటిఫికేషన్లో పేర్కొంది.













