ఆస్పత్రులకు ముకుతాడు వేసిన జగన్ సర్కార్… ఫీజులను నిర్ణయిస్తూ జీవో జారీ
కోవిడ్ చికిత్సపై ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారీతిలో ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ వాటికి ముకుతాడు వేయడానికి రెడీ అయ్యింది. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో చికిత్స ఫీజును నిర్ణయిస్తూ ఏపీ సర్కార్ ఓ జీవో జారీ చేసింది. సాధారణ చికిత్సకు ఎన్ఏబీహెచ్ ఆస్పత్రుల్లో రోజుకు 4 వేల రూపాయలు, ఎన్ఏబీహెచ్ ఆమోదం లేని వాటిల్లో 3,600 రూపాయలుగా నిర్ధారించింది. సాధారణ కోవిడ్ చికిత్సతో పాటు ఆక్సిజన్ కలిపి ఎన్ఏబీహెచ్ ఆస్పత్రుల్లో 6,500 గా, ఇదే చికిత్సకు ఎన్ఏబీహెచ్ ఆమోదం లేని ఆస్పత్రులకు 5,850 ఫీజు వసూలు చేయాలని సర్కార్ ఆదేశించింది. ఐసీయూ, వెన్ఐవీ, క్రిటికల్ చికిత్సకు ఎన్ఏబీహెచ్ ఆస్పత్రుల్లో 12 వేల రూపాయలు, ఈ ఆమోదం లేని ఆస్పత్రులకు 10,800 రూపాయలుగా ప్రభుత్వం తన జీవోలో పేర్కొంది.













