అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించిన ఏపీ ప్రభుత్వం
తమ డిమాండ్లను పరిష్కారించాలని కోరుతూ గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మెను నిషేధిస్తున్నట్లు అందులో పేర్కొంది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకి తీసుకొస్తూ జీవో నెంబవర్ 2 విడుదల చేసింది. దీని ప్రకారం ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. సుమారు రూ.3,450 తగ్గించి, రూ.8,050 వేతనాన్ని వారి ఖాతాలో జమచేసింది.













