ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు
ప్రముఖ వైద్యుడు, రేడియేషన్ ఆంకాలజిస్టుల్లో అత్యంత అనుభవం ఉన్న డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారు (సమగ్ర క్యాన్సర్ సంరక్షణ)గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన్ని కేబినెట్ హోదాలో రెండు సంవత్సరాల పదవీకాలంతో సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలనశాఖ (రాజకీయ) కార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులు జారీచేశారు. క్యాన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సీఎం వైఎస్ జగన్ను కలిసి ఇటీవల చర్చించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తగిన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాలని డాక్టర్ నోరిని ముఖ్యమంత్రి కోరిన విషయం విదితమే. రేడియేషన్ ఆంకాలజీలో దేశంలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకు 43 ఏళ్ల అనుభవం ఉంది. బ్రెస్ట్ సెంటర్, గైనకాలజిక్ ఆంకాలజీ, హెడ్, మెడ, న్యూరో ఆంకాలజీ, థొరాసిక్ ప్రోగ్రాంల కోసం కొత్త టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నిక్లను అభివృద్ధి చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.













