ఈ నెల 22న శాసనసభలో, 23న శాసన మండలిలో
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకున్నట్లు హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నెల 22న శాసనసభలో, 23న శాసన మండలిలో ఉపసంహరణ బిల్లులను ఆమోదించినట్లు శాసనసభ కార్యదర్శి తెలిపారని అఫిడవిట్లో పేర్కొంది. ఈ నెల 22న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రెండు బిల్లుల కాపీలను అఫిడవిట్‌తో జతచేసి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది. అఫిడవిట్ కాపీలను పిటిషనర్లకు పంపించినట్లు పురపాలక శాఖ ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. దీంతో విచారణను హైకోర్టు వాయిదా వేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈ అఫిడవిట్‌ను ఉన్నత న్యాయస్థానంలో దాఖలు చేశారు.













