రాజధానిపై రాష్ట్రాలదే నిర్ణయాధికారం: ఏపీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో గురువారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అంశం చట్ట పరమైన సమీక్ష పరిధిలోకి రాదంటూ అఫిడవిట్లో పేర్కొంది. రాజధానిపై తమకు ఏ పాత్రా లేదని కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టంగా చెప్పిందని కాబట్టి రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రాలదేనని తేల్చి చెప్పంది.. కేంద్రం కూడా అదే విషయం తన అఫిడవిట్లో పేర్కొందని గుర్తు చేసింది. ఇది రాజ్యాంగ ఉల్లంఘనలు, పార్లమెంట్ చట్టాల ఉల్లంఘనల పరిధిలోది కాదంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 38 అనుసరించి, ప్రజా ప్రయోజనాలు, ఆర్ధిక పరిస్థితిని బట్టి ఈ నిర్ణయం తీసుకున్నామంది. తాము కేంద్ర చట్టాలను ఎక్కడా ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. రాజధాని సహా వివిధ అభివృద్ధి పధకాలను, ప్రాజెక్టులను సమీక్షించే అధికారం రాష్ట్రానికి ఉంటుందని, పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఎ రద్దు చట్టాలపై అభ్యంతరాలు పరిగణనలోకి రావంది.













