కర్ఫ్యూ వేళలను సడలిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు

కర్ఫ్యూ వేళలను సడలిస్తూ ప్రజలకు ఊరటనిచ్చింది ఏపీ ప్రభుత్వం. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కర్ఫ్యూ సమయాన్ని సడలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే కర్ఫ్యూ సమయాన్ని సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 20 నుంచి 30 తేదీ వరకూ ఈ కొత్త ఆంక్షలు అమలులో ఉంటాయి. అయితే సాయంత్రం 5 వరకే దుకాణాలు తెరవాల్సి ఉంటుంది. 5 తర్వాత దుకాణాలను మూసేయాల్సి ఉంటుందని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే తూర్పు గోదావరి జిల్లాను మాత్రం ఈ నూతన సడలింపుల నుంచి మినహాయించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకే అక్కడ సడలింపులు ఉంటాయి. మధ్యాహ్నం 2 నుంచి మర్నాడు ఉదయం 6 వరకూ కర్ఫ్యూ కొనసాగుతుంది. కరోనా కేసులు అధికంగా ఉండటమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు.