జూన్ 10 వరకూ ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు

కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 10 వరకూ కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే విధించిన కర్ఫ్యూ సమయం సోమవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సమావేశం తర్వాతే కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకూ ఉన్న సడలింపు సమయం యథాప్రకారం కొనసాగుతుందని స్పష్టం చేసింది.