వ్యాక్సిన్ పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ ను రూపొందించిన ఏపీ సర్కార్
ఏపీలో వ్యాక్సినేషన్‌ను త్వరత్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు ఓ ప్రత్యేక యాప్‌ను సైతం ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సోమవారం నుంచి ఈ టీకా పర్యవేక్షణ యాప్ అందుబాటులోకి వస్తుందని అధికారులు పేర్కొన్నారు. లబ్ధిదారుల వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు ఈ యాప్‌లో పొందుపరచనున్నారు. రిజిస్ట్రేషన్ ఐడీ, మొబైల్ నెంబర్, పేరు వివరాల ద్వారా లబ్ధిదారుల వివరాలను ఇందులో పరిశీలించే వెసులుబాటు కలుగుతుంది. ఈ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ యాప్‌కు హెచ్సీడబ్ల్యూ, ఎఫ్‌ఎల్‌డబ్ల్యూ డ్రైవ్‌గా అధికారులు పేరు పెట్టారు.













