రెండేళ్లలో చేపట్టిన కార్యక్రమాలే గెలిపిస్తాయి
బద్వేల్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలే గెలిపిస్తాయని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 98 శాతం ఇచ్చిన హామీలు అమలు చేశామని, ఈ రెండేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి భారీ విజయాలు దక్కాయని అన్నారు. సీఎం వైఎస్ జగన్ అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 50 శాతానికి పైగా పదవులిచ్చామని పేర్కొన్నారు. కొందరు కులమతాల మధ్య చిచ్చు పెట్టే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా విపక్షాలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు.













