ప్రతి మున్సిపాలిటీ ఇక స్మార్ట్ : చంద్రబాబు
రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీని స్మార్ట్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు కమాండ్ కంట్రోల్ కేంద్రం పనితీరును సమీక్షించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, అర్బన్ ప్రాంతాల్లో గణనీయమైన మార్పులు కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కమాండ్ కంట్రోల్ పర్యవేక్షణలో మున్సిపాల్టీల్లో పచ్చదనం-పరిశుభ్రతను పెంచుతామని, నగరాలు, పట్టణాలను సుందరీకరిస్తామని అన్నారు.













