మండలి రద్దుపై వెనక్కి.. తగ్గేది లేదు

శాసన మండలిని రద్దు చేయాలన్న తమ ప్రభుత్వ నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గవర్నర్ కోటాలో మండలికి ఎంపికయిన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ మండలి రద్దు తీర్మానం అనేది ఎత్తుగడలో భాగంగా తమ ప్రభుత్వం చేయలేదన్నారు. మండలి వ్యవస్థ ఉండకూడదనేదే తమ ఉద్దేశ్యమన్నారు. ప్రతిపక్షం శాసనమండలిని నవ్వలాటగా మార్చిందని అన్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందని విమర్శించారు. నాలుగు ఎమ్మెల్సీలను కాపు, ఎస్సీ, ఓసీ, బీసీ వర్గాలకు ఇచ్చారని, ప్రతి సందర్భంలోనూ అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి న్యాయం చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి ఊహాగానాలకు తావులేకుండా సీఎం జగన్ సృష్టమైన నిర్ణయాలు తీసుకుంటారని గుర్తు చేశౄరు. ముగ్గురు మైనారిటీలకు, బీసీలకు అధిక ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామని తెలిపారు.