ఏపీ అసెంబ్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగం
ఆంధప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ జి.శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమావేశాల నిర్వహణపై స్పీకర్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమీక్షించినట్లు చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉంటుందని తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ వచ్చే సభ్యులకు ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సభ్యులకు మినహా ఇతరులెవ్వరికీ అసెంబ్లీలోకి అనుమతి లేదని సృష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం ఉంటుందని తెలిపారు. సభ ఎన్ని రోజులు ఉంటుందో ఈ సమావేశంలో నిర్ణయిస్తామని తెలిపారు.













