అంతర్జాతీయ తెలుగు సంబరాలు విజయవంతం కావాలి
ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 6, 7, 8వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరంలోని వెస్ట్ బెర్రీ హైస్కూల్లో అంతర్జాతీయ తెలుగు సంబరాలు నిర్వహిస్తుండడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. తెలుగు భాషలోని వివిధ సాహితీ ప్రక్రియలపై సదస్సులు, ప్రదర్శనలు, వివిధ దేశాల నుండి తెలుగు ప్రతినిధులు, అన్ని రాష్ట్రాల నుంచి తెలుగు సంస్థల నిర్వాహకులు, ఎందో ప్రముఖ కవులు, కళాకారులు, చలనచిత్ర ప్రముఖులు, తెలుగు కవులు, రాజవంశీయుల వారసులు తదితరులు ఈ సంబరాలకు వచ్చి తెలుగు భాషా వికాసం కోసం కృషి చేస్తుండడం సంతోషకరమని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఈ సంబరాల్లో తెలుగు సాహితీ ప్రముఖులు ఆంధ్ర వాజ్మయ వైజయంతి అనే ప్రత్యేక సంచికను రూపొందించి విడుదల చేయడం నాకు ఎంంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు.













