రాజ్ భవన్ లో గవర్నర్ తేనీటి విందు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ గణతంత్ర వేడుకల సంద్భంగా రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఇచ్చారు. విందుకు హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ దంపతులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు, మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేస్, ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సాధారణంగా ఈ విందుకు మంత్రులందరూ, ఎంపీలు, అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు వస్తారు. కానీ 25 మంది మంత్రులున్నా కేవలం ఇద్దరే హాజరయ్యారు. విజయవాడ నగరానికి చెందిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుహుల్లా మాత్రమే వచ్చారు. అధికార వైసీపీకి చెందిన మరే ఇతర ప్రజా ప్రతినిధులూ రాజ్‌భవన్ వైపు రాలేదు.













