ఏపీ గవర్నర్ విరాళం
కరోనా మహమ్మారిని కట్టడిచేసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి ఆంధప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన వంతు సాయం ప్రకటించారు. కరోనా నివారణ చర్యల కోసం ప్రధాని కేర్స్ నిధికి ఒక నెల జీతం, ఏపీ సీఎం సహాయ నిధికి రూ.లక్ష చొప్పున విరాళం ఇస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలు ఉదారంగా విరాళాలు అందించి ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల్ని ప్రజలు పాటించాలని సూచించారు. 21 రోజుల లాక్డౌన్ను అందరూ పాటించాలన్నారు. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.













