ఉగాది వేడుకల్లో దేవాన్ష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మనువడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగినా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరితోపాటు సాంప్రదాయ పంచెకట్టులో దేవాన్ష్‌ను తీసుకొచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటోలు, వంటకాల గురించి మనువడికి చంద్రబాబు వివరించారు. కొందరు చిన్నారులు దేవాన్ష్‌తో కరచాలనం చేయడానికి పోటీ పడ్డారు. వేదికపై పండితులు మొదట ఉగాది పచ్చడిని ముఖ్యమంత్రికి అందజేశారు. ఆయన దానిని తీసుకున్న తర్వాత భువనేశ్వరికి అందజేశారు. ఆమె పచ్చడి తిన్న తర్వాత ఆ గిన్నెను తీసుకుని మనువడికి తినిపించబోయారు. అయితే దేవాన్ష్ తిరస్కరించడంతో సభలో నవ్వులు విరిశాయి. పంచాంగ శ్రవణం జరుగుతున్న సమయంలో మనువడితో మాట్లాడుతూ అడిగిన దానికల్లా ముఖ్యమంత్రి సమాధానం చెబుతూ కనిపించారు.













