పాలనలో మార్పులు…
ఏపీ ప్రభుత్వం పాలనలో మార్పులు భాగంగా కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఇకపై పేరెంట్స్ కమిటీ స్థానంలో..స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు పనిచేస్తాయి. గత ప్రభుత్వంలో అమలైన కొన్ని విధానాలను మార్చుతూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా పాఠశాలల్లో ఉండే పేరెంట్స్ కమిటీ స్థానంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది. స్కూళ్లలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఇప్పటి వరకు పేరెంట్స్ కమిటీలు అమల్లో ఉన్నాయి. అయితే తాజాగా వీటి స్థానంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే గురువారం మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలల్లోమధ్యాహ్న భోజనం మౌలిక సదుపాయాలను పర్యవేక్షించడం ఈ మేనేజ్మెంట్ కమిటీ విధులు. ఇక ఆగస్టు 8వ తేదీన ఇందుకు సంబంధించి ఎన్నికలను నిర్వహించనున్నారు. అదే రోజు కమిటీ ప్రమాణ కార్యక్రమం ఉంటుంది.













