Partnership Summit : విశాఖలో పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్

రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే విశాఖ వేదికగా నవంబర్ 14, 15 తేదీల్లో పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ (Partnership Summit) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సమ్మిట్ నిర్వహణకు పలు కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు మంత్రుల బృందంతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మంత్రుల బృందానికి మంత్రి లోకేశ్(Lokesh) చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేశ్, నారాయణ (Narayana) , కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) ఉన్నారు. వసతుల కల్పన, ఏర్పాట్లకు సంబధించి అధికారులతో మరో 9 వర్కింగ్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ (Vijayanand ) ఉత్తర్వులు జారీ చేశారు.