అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా గండికోట
కడప జిల్లాలోని గండికోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరో నెల రోజుల్లో అంకురార్పణ జరగనుంది. గండికోట వద్ద పెన్నా నది భూ నిధిలోని 2వేల ఎకరాల్లో అయిదు జోన్లుగా పర్యాటక వసతులను అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రాథమికంగా ప్రతిపాదనలను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది. ఇక్కడనున్న గండికోట, మైలవరం రిజర్వాయర్లు, కోట, ఆలయాలు, రాతి కొండలు, చారిత్రక, వారసత్వ కట్టడాలు, పెన్నానది ప్రధాన ఆకర్షణలు. 2015లోనే ముఖ్యమంత్రి గండికోటకు వెళ్లినప్పుడు, ఆ ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. జమ్మలమడుగు నుంచి గండికోట వరకు ఉన్న 14 కిలోమీటర్ల రహదరిని రూ.16 కోట్లతో నాలుగు వరుసల దారిగా విస్తరిస్తామని ప్రకటించారు. ఇప్పుడు కార్యరూపం దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.













