Amaravathi: లక్ష ఎకరాల లో అమరావతి: ప్రపంచ రికార్డు దిశగా నూతన రాజధాని..
అమరావతి (Amaravati) ఇప్పుడు ప్రపంచ రికార్డు స్థాయిలో రాజధానిగా మారబోతుంది. ఇది సాధారణంగా విషయం కాదు..ఎందుకంటే ఏకంగా లక్ష ఎకరాల భూమిలో రాజధానిని నిర్మించాలని కూటమి ప్రభుత్వం ధృఢంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 2014 నుండి 2019 వరకు అప్పటి టీడీపీ (TDP) హయాంలో 34,000 ఎకరాల భూమిని సేకరించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రైతులతో చర్చలు జరిపి, అభ్యంతరాలు లేకుండా భూములను తీసుకోవడం ఒక పెద్ద విజయం. ఈ ప్రణాళిక ప్రపంచవ్యాప్తంగా మెచ్చుకోబడింది. ఎందుకంటే, భూములు ప్రభుత్వ అవసరాల కోసం తీసుకునే సమయంలో వివాదాలు చెలరేగడం సాధారణం. కానీ అమరావతిలో అటువంటి సమస్యలు రాకుండా, సాఫీగా భూసేకరణ జరగడం విశేషం.
మధ్యలో వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని నిలిపివేయడంతో అభివృద్ధి ఆగిపోయింది. అయితే, తాజాగా ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి (NDA alliance) మళ్లీ అమరావతినే మొదటి ప్రాధాన్యతగా తీసుకుంది. భవిష్యత్తులో దేశానికే కాదు, ప్రపంచానికి ఆదర్శంగా నిలబడేలా అమరావతిని నిర్మించాలని సంకల్పించుకుంది. ఇందుకోసం కేంద్రం (Central Government) తో చర్చలు జరిపి, ఇప్పటికే రూ. 45,000 కోట్ల నిధులను సమకూర్చారు. ఈ నెలలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) చేతుల మీదుగా తొలి దశ పనులు ప్రారంభమవుతాయి. ఇంతలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా మరో 44 వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఈ భూముల్లో అవుటర్ రింగ్ రోడ్ (Outer Ring Road), ఇన్నర్ రింగ్ రోడ్ (Inner Ring Road), విమానాశ్రయం (Airport), రైల్వే లైన్లు (Railway Lines), పారిశ్రామిక సంస్థలు (Industrial Units) వంటి కీలక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. ఇలా కోర్ క్యాపిటల్ (Core Capital) ను మించి అభివృద్ధిని విస్తరించాలనే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నారు.
ఈ భూములను తుళ్ళూరు (Tulluru), అమరావతి (Amaravati), తాడికొండ (Tadikonda), మంగళగిరి (Mangalagiri) మండలాల నుంచి సేకరించనున్నారు. ఉదాహరణకు తుళ్ళూరులోని హరిశ్చంద్రాపురం (Harishchandrapuram), వడ్లమాను (Vadlamanu), పెదపరిమి (Pedaparimi) గ్రామాల్లో 9,919 ఎకరాలు, అమరావతిలోని వైకుంఠాపురం (Vaikunthapuram), ఎండ్రాయి (Endroyi), కార్లపూడి (Karlapudi), మొత్తడాక (Mottadaka), నిడమొక్కల (Nidamukkala) గ్రామాల్లో 12,838 ఎకరాలు, తాడికొండలోని తాడికొండ (Tadikonda), కంతేరు (Kantheru) గ్రామాల్లో 16,463 ఎకరాలు, మంగళగిరిలోని కాజా (Kaza) గ్రామంలో 4,492 ఎకరాలు సేకరించనున్నారు. భూసేకరణ ప్రక్రియ కోసం సీఆర్డీయే (CRDA) త్వరలో నోటీసులు జారీ చేయనుంది. రైతుల సహకారంతో ఈ ప్రక్రియ సాఫీగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రభుత్వ భూములను కలుపుకుని ఈ 44 వేల ఎకరాలను జోడిస్తే, అమరావతి దాదాపుగా లక్ష ఎకరాల రాజధానిగా రూపుదిద్దుకుంటుంది. ఇది నిజంగా ప్రపంచ రికార్డు సృష్టించే స్థాయి అభివృద్ధి అవుతుంది.













