ప్రవాసాంధ్ర హెల్ప్‌లైన్ ఏర్పాటు
ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభివృద్ది కోసం రూ.40 కోట్లతో నిధిని ఏర్పాటుచేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 24 గంటలు పనిచేసే.. ఫోన్ చేయగానే స్పందించే ప్రవాసాంధ్ర హెల్ప్‌లైన్ ఏర్పాటుచేస్తారు. ప్రవాసాంధ్ర భరోసా పేరుతో బీమా సౌకర్యం కల్పిస్తారు. ప్రవాసాంధ్ర సహాయనిధి కోసం రూ.40 కోట్లు కేటాయిస్తారు. బీమా పథకంలో ప్రమాదవశాత్తూ చనిపోయినా, అంగవైకల్యం కలిగినా రూ.10 లక్షల కవరేజీ ఇస్తారు. ఆస్పత్రి ఖర్చుల కోసం అదనంగా రూ.లక్ష చెల్లిస్తారు. న్యాయసహాయ ఖర్చుల కోసం రూ.45 వేలు చెల్లిస్తారు. మూడేళ్ల కాలానికి సంబంధించి బీమా ప్రీమియం రూ.375 వరకు ఉంటుంది. అంటే ఏడాదికి రూ.125. దీనిలో ఏడాదికి రూ.50 చొప్పున మూడేళ్లకు రూ.150 ప్రవాసులు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.225ను ఏడాదికి రూ.75 చొప్పున రాష్ట్రప్రభుత్వం చెల్లిస్తుంది.













