ప్రవాసాంధ్రుల సంక్షేమానికి రూ.25 కోట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన తెలుగువారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వలస వెళ్లిన వారి (మైగ్రెంట్స్) సంక్షేమం, అభివృద్ధి విధానం అమలుకి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు విడుదల చేసింది. ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ద్వారా అమలు చేస్తోంది. కార్యక్రమం అమలుకి రూ.40 కోట్లు ఇవ్వాలని ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ సీఈఓ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తొలి విడతలో రూ.25 కోట్లు మంజురూ చేస్తూ ఆర్థిక శాఖ ఇది వరకే ఉత్తర్వులు జారీ చేసింది. ఆ నిధుల్ని ఖర్చు చేసేందుకు ఏపీ ఎన్ఆర్టీకి పాలనాపరమైన అనుమతలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.













