ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ సమయంలో రక్తదానం కార్యక్రమాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్లడ్ డొనేషన్ క్యాంపుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పలు సహాయ సంస్థలు, ఛారిటీ సంస్థల ద్వారా నిర్వహించబడే రక్తదాన కార్యక్రమాల్లో చాలామంది పాల్గొనే అవకాశం ఉంది. ఇలాంటి సమూహాల వల్ల వైరస్ వ్యాప్తి పెరగొచ్చని ప్రభుత్వం భావించింది. దీంతో లాక్డౌన్ ముగిసే వరకు వీటిపై నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.













