వైఎస్ జగన్ నివాసం వద్ద సందడి
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ కైవసం చేసుకున్న వైఎస్ జగన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకుంటున్నారు. అధినేతను కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. పరిపాలనలో కీలకమైన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు జగన్‌కు కలిసి అభినందించేందుకు ఆయన నివాసానికి వస్తున్నారు. నేతలతో సమావేశం తర్వాత ఐఎఎస్‌లు, ఐపీఎస్‌లు ఉన్నతాధికారులతో జగన్ భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను అధికారులకు వివరించి అందుకు అనుగుణంగా సూచనలు చేశారు. పరిపాలనలో తాను తీసుకురాదల్చుకున్న మార్పులు, అనుసరించే విధానాలను అధికారులకు ఆయన తేలియజేశారు. పార్టీ ఎమ్మెల్మేలు, ఎంపీలు అధికారుల రాకతో జగన్ నివాసం వద్ద సందడిగా మారింది.













