23 సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
ఆహార శుద్ధి రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త అధ్యయనానాకి శ్రీకారం చుడుతోంది. ఆహార శుద్ధి రంగంలో రూ.850 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన 23 ప్రసిద్ధ సంస్థలతో ప్రభుత్వం సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సంతకాల కార్యకమం కూడా జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మొత్తం 108 ఎంవోయూలు కుదుర్చుకున్నామని, దీని ద్వారా రాష్ట్రంలో 9477 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు. 6 నెలలకోసారి ఒప్పంద సంస్థలతో సమావేశం నిర్వహిస్తామని సృష్టం చేశారు. పుడ్ ప్రాపెసింగ్లో ఏపీకి అపార అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టేవారికి అన్ని విధాలా సహకరిస్తామని సృష్టం చేశారు. వ్యవసాయంపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. రైతులకు సాంకేతిక సహకారం అందించాలని, రైతులు పంటలు పండించినా సరైన మార్కెటింగ్ లేదని అన్నారు. మెగాపుడ్ పార్కులు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభించాలని, పుడ్ ప్రాసెసింగ్లో పరిశోధనలు పెరగాలని అన్నారు.













