ఎడెక్స్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం..
విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పునకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇక నుంచి ఉన్నత విద్యలో ప్రపంచ స్థాయి కోర్సులు అదీ అత్యుత్తమ యూనివర్సిటీల సర్టిఫికెట్ కోర్సులు ఉచితంగా అందించబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇందుకోసం ప్రఖ్యాత సంస్థ ఎడెక్స్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. ప్రఖ్యాత మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కంపెనీ ఎడెక్స్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎడెక్స్ సీఈవో, పద్మశ్రీ అనంత్ అగర్వాల్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, క్రేంబ్రిడ్జి సహా పలు ప్రపంచ అత్యుత్తమ వర్శిటీల నుంచి సంయుక్త సర్టిఫికెట్లను విద్యార్థులకు అందిస్తారు.
ఈ ఒప్పందం ఉన్నత విద్యలో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఆకాక్షించారు. నిరుపేద విద్యార్థులకు ఈ ఒప్పందం కారణంగా మరింత మేలు జరుగుతుంది. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థికి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల కోర్సులను నేర్చుకునే అవకాశం ఉంటుంది. కోర్సులు చేసిన విద్యార్థులకు హార్వర్డ్, ఎంఐటీ, క్రేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్శిటీలతో ఎడెక్స్ సంయుక్త సర్టిఫికేషన్ విద్యార్థులకు లభిస్తుంది.













