Liquor Scandal: మద్యం కుంభకోణంపై .. కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం?
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం (Liquor scandal) వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. దీనిపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణంపై టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులు (Sri Krishna Deva Raya) లోక్సభలో గళమెత్తిన సంగతి తెలిసిందే. రూ.4వేల కోట్ల కు పైగా విదేశాలకు తరలించారంటూ ఆయన ఆరోపణలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా (Amit Shah)తో శ్రీకృష్ణదేవరాయులు భేటీ అయ్యారు. తాజాగా సీఎం చంద్రబాబు (Chandrababu) తో ఆయన సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందనే చర్చ జరుగుతోంది.













