ఉల్లంఘిస్తే 6 నెలల జైలు
కరోనా వైరస్ను కట్టడి చేయడంలో భాగంగా ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆంధప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం ఆరు నెలల పాటు జైలుకు పంపించడంతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించే అధికారం సంబంధిత అధికారులకు కల్పించింది. లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉన్న సేవలు తప్ప మిగతావన్నీ ఆపేయాలని సృష్టం చేసింది. 1897 అంటువ్యాధుల నియంత్రణ చట్టాన్ని అమలులోకి తెస్తూ జీఓఆర్టీ నంబర్ 209 ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ఈ నెల 31 వరకూ ఏపీ అంతటా లాక్ డౌన్ ప్రకటించింది.













