ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ … జనవరి 1 నుంచి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కొత్త ఏడాదిలో వృద్ధాప్య ఫించను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెలనెలా రూ.2,250 ల చొప్పున పింఛను ఇస్తుండగా ఇకపై దాన్ని రూ.2,500లకు పెంచి ఇవ్వనుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నారు. ఈ మేరకు కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన స్పందన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయాలను వెల్లడించారు. ప్రతి ఏడాది పెన్షన్ను పెంచుకుంటూ పోతానని గతంలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. అయితే ఏడాదిన్నరగా పెన్షన్లు పెరగలేదు. ఎట్టకేలకు జనవరి నుంచి మరో రూ.2.500 పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.













