భోళాశంకర్ కు ఏపీ ప్రభుత్వం షాక్
ఈ నెల 11న రిలీజ్ కానున్న మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమాకు టికెట్లు రేట్లు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి తిరస్కరించింది. భోళా శంకర్ నిర్మాతలు సినిమా టికెట్ల రేట్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. సినిమాటోగ్రఫీ చట్ట ప్రకారం నిర్దేశిత రేట్లపై అదనంగా వసూలు చేయాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నిర్మాతల దరఖాస్తును పరిశీలించి సినిమా బడ్జెట్, సాంకేతిక నిపుణులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంత మేరకు పెంచుకోవచ్చని ప్రభుత్వం జీవో రూపంలో అనుమతిస్తుంది. ఈ క్రమంలో భాగంగానే ఈ నెల 11న విడుదలవుతున్న భోళాశంకర్ చిత్రానికి టికెట్ రేట్ల పెంపుకోసం నిర్మాతలు దరఖాస్తు చేసుకోగా బడ్జెట్తో పాటు పలు దరఖాస్తులు అసంపూర్తిగా ఉన్నాయని, పలు డాక్యుమెంట్లు జత చేయలేదని ప్రభుత్వ వర్గాలు తిరస్కరించినట్లు తెలిసింది.













