ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… ఆ రెండు రోజులు సెలవు
ఆంధప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 7, 8 తేదీల్లో సెలవులనూ ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ ఉత్తర్వులను జారీ చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వేళ స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలకు కూడా సెలవు ఇవ్వాలని, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 48 గంటల ముందుగానే మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 8న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.













