చంద్రబాబు హాజరుకారు… లాయర్ ను పంపుతారు
బాబ్లీ పోరాట ఘటనకు సంబంధించి కోర్టు నోటీసులు అందుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తరపున న్యాయవాదిని ధర్మాబాద్ న్యాయస్థానానికి పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి తరపున న్యాయవాదులు వెళ్లి నాన్ బెయిల్‌పై రీకాల్ పిటిషన్ చేయనున్నారు. ఎనిమిదేళ్ల క్రితం బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుతో సహా కొందరు టీడీపీ నేతలు మహారాష్ట్రలోని ధర్మాబాద్‌లో ఆందోళన చేపట్టారు. ప్రాజెక్టు పరిశీలన నిమిత్తం వెళ్తున్న వీరిని పోలీసులు అడ్డుకుని కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించిన న్యాయస్థానంలో హాజరుకావాలంటూ చంద్రబాబుతో పాటు మంత్రులు దేవినేని ఉమ, నక్కా ఆనంద్‌బాబు సహా 16 మందికి ధర్మాబాద్ కోర్టు ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి చంద్రబాబు పార్టీ నేతలు, న్యాయవాధులతో తర్జనభర్జనలు సాగించారు. ఈ నెల 22న ఐక్యారాజ్యసమితిలో పాల్గొనే అరుదైన అవకాశం ఉన్నందున తన బదులు న్యాయవాదులను కోర్టుకు పంపాలని చంద్రబాబు నిర్ణయించారు.













