Quantum Valley: ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అమరావతి : డిక్లరేషన్‌కు ఆమోదం
క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. జూన్ 30న విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ (Quantum Valley) వర్క్‌షాప్‌లో చేసిన డిక్లరేషన్‌కు ఆమోదం లభించింది. ఈ మేరకు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ (Katamaneni Bhaskar) ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతి (Amaravati )ని క్వాంట్ గేట్ వే హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ (Quantum Valley Declaration) ను రూపొందించారు. క్వాంటమ్ పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడిరచారు. దేశంలోనే అతి పెద్ద క్వాటమ్ బెడ్‌గా క్యూ చిప్ ఇన్ను వచ్చే 12 నెలల్లో అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2035 నాటికి ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అమరావతి అభివృద్ధే లక్ష్యమని ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడిరచింది. 2026 లో ప్రారంభమయ్యే అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్‌లు అందజేయాలని నిర్ణయించారు.













