సంచయిత గజపతిరాజుకు ఏపీ ప్రభుత్వం కీలక పదవి
మాన్సస్ ట్రస్ట్ చైర్పర్సన్ సంచయిత గజపతిరాజుకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం కీలక పదదవి కట్టబెట్టింది. తూర్పుగోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు చైర్ పర్సన్‌గా సంచయితను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 2న దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది. సింహాచలం ఆలయంతోపాటు తూర్పుగోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు గతంలో చైర్మన్‌గా సంచయిత తండ్రి ఆనందగజపతిరాజు వ్యవహరించారు. ఆనందగజపతిరాజు వారసురాలిగా సంచయితను చైర్మన్‌గా నియమించాలని దేవాదాయశాఖకు ప్రభుత్వం అక్టోబర్ 27న లేఖ రాసింది. రూ.2 లక్షల కంటే తక్కువ ఆదాయమున్న 104 ఆలయాలకు సంచయిత చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తారు. సింహాచల దేవస్థానం పాలక మండలి చైర్ పర్సన్‌గా ఆనంద గజపతిరాజు రెండో కుమార్తె సంచయితను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ తర్వాత విజయనగరరాజుల ఆధీనంలో మాన్సన్ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ ఆమెకు బాధ్యతలు అప్పగించారు.













