పోలవరం కాదు…ఇక అమరావతి యాత్రలు
పోలవరం యాత్రల తరహాలో అమరావతి యాత్రలకు వచ్చే నెల శ్రీకారం చుట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. శరవేగంగా నిర్మిస్తున్న రాజధాని అమరావతి గురించి కూడా రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకొనేలా అమరావతి యాత్రలు జరగనున్నాయి. తొలుత విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ దర్శనం చేయించి, అనంతరం వారిని అమరావతిలో వివిధ ప్రాధాన్య రహదారులు, గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని గృహ సముదాయాలు, ఇతర నిర్మాణాలు చూపిస్తారని సమాచారం. సందర్శకుల వెంట ఉండే ఏపీసీఆర్డీయే అధికారులు మాస్టర్ ప్లాన్‌లో పలు విశేషాలు కూడా వివరిస్తారని భోగట్టా.













