సజ్జల రామకృష్ణారెడ్డి పదవీ కాలం మరో యేడాది పాటు పొడిగింపు.. మిగితా వారివి కూడా పొడిగింపు

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పదవీ కాలంతో పాటు ఇతర సలహాదారుల పదవీ కాలాన్ని మరో యేడాది పాటు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పదవీకాలం ఈ నెల 18తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో మరో యేడాది పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఏపీ సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లం పదవీ కాలాన్ని కూడా మరో యేడాది పాటు పొడిగించారు. ఈయన పదవీ కాలం ఈ నెల 4 వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. మరో సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ (కమ్యూనికేషన్స్) పదవీ కాలాన్ని కూడా మరో యేడాది పాటు పొడిగించారు. ఈయన పదవీ కాలం ఈ నెల 7 వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో యేడాది పాటు ప్రభుత్వం పొడిగించింది. ఇక కోఆర్డినేటర్, కార్యక్రమాలు ప్రభుత్వ సలహాదారు తలశిలర రఘురాం పదవీ కాలాన్ని కూడా మరో యేడాది పాటు పొడిగిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.