కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో మంత్రి బుగ్గన భేటీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్‌రాక్ పరిశ్రమకు సంబంధించి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ న్యాయస్థానంలో జరుగుతున్న ప్రక్రియపై కేంద్ర మంత్రితో చర్చించారు. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులుగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పంకజ్ చౌదరి, భగవత్ కిషన్‌రావు కరాడ్లను బుగ్గన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పలు అంశాలపై వారితో చర్చించారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ అన్‌రాక్ పరిశ్రమకు సంబంధించి గత నెలలో లండన్‌లో మొదటి దశ ఆర్బిట్రేషన్ పూర్తయిందని, ఈ నెలలో మరో దఫా జరగనుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఉన్నారు.













