Ap Fibernet : ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగులకు షాక్..410 మందిని తొలగిస్తాం : జీవీ రెడ్డి
ఏపీ ఫైబర్‌నెట్‌ను ప్రక్షాళన చేస్తున్నామని చైర్మన్ జీవీ రెడ్డి (GV Rreddy) తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫైబర్ నెట్ (Fibernet) నుంచి ఆర్జీవీ(RGV) కి అక్రమంగా డబ్బు చెల్లించారు. డబ్బు తిరిగి చెల్లించేందుకు ఆయనకు 15 రోజుల సమయం ఇచ్చాం. గడువులోగా డబ్బు చెaల్లించకుంటే ఆర్జీవీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. గత ప్రభుత్వం అర్హతలేని వారిని ఫైబర్ నెట్లో నియమించింది. గత ప్రభుత్వం నియమించిన 410 మందిని తొలగిస్తాం. వైసీపీ నేతల ఆదేశాలతో అర్హత లేని వారిని నియమించారు. కొందరు సిబ్బంది వైసీపీ(YCP) మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పనిచేశారు. వేతనాల పేరుతో ఫైబర్ నెట్ నుంచి రూ.కోట్లు దుర్వినియోగం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వైఖరితో ఫైబర్‌నెట్ దివాలా అంచుకు చేరింది. మేం కక్షతో, దురుద్దేశంతో ఉద్యోగులను తొలగించడం లేదు. ఉద్యోగులకు లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరతాం. ఫైబర్ నెట్లో అవసరాల మేరకు ఉద్యోగులను తీసుకుంటాం అని తెలిపారు.













