AP Fiber Net : ఆ ఛార్జ్‌షీట్‌ను కోర్టు కొట్టివేసినా.. సొంతపత్రికలో తప్పుడు కథనం
ఫైబర్ నెట్ వ్యవహారంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu )పై పెట్టిన కేసులో విచారణాధికారులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను న్యాయస్థానం కొట్టివేసిందని ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి (G.V. Reddy) తెలిపారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఛార్జ్‌షీట్‌ను కోర్టు తిరస్కరిస్తే జగన్ (Jagan ) సొంతపత్రికలో మాత్రం తప్పుడు కథనం ప్రచురించారన్నారు. అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించారంటూ వార్త రాశారని జీవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టిన మధుసూదన్‌రెడ్డి(Madhusudhan Reddy), గౌతమ్‌రెడ్డి(Gautham Reddy)పై కేసు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. సీఐడీపై వచ్చిన ఆరోపణలపై ఆ విభాగం అధికారులు స్పందించి స్పష్టత ఇవ్వాలని ఆయన సూచించారు.













