రాజకీయాల్లో ఉంటే వైసీపీలోనే.. లేకపోతే ఇంట్లో
రాజకీయాల్లో ఉంటే వైసీపీలోనే, లేకపోతే ఇంట్లో ఉంటానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ హోంమంత్రి, ప్రతిపాడు ఎమ్మెల్యే సుచరిత వెల్లడించారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానం సీఎం జగన్తోనేనని తెలిపారు. సోషల్ మీడియాలో ఏదో వస్తే ఆపార్థం చేసుకుని రకరకాలుగా ప్రచారం చేస్తే ఎట్లా అని ప్రశ్నించారు. భర్త ఎటు ఉంటే భార్య అంటే ఉంటుందనడంలో తప్పేముందన్నారు. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళుతున్నప్పుడు నాభర్త దయాసాగర్తో చెబితే వెళ్లమన్నారు. దయాసాగార్ టీడీపీలోకి వెళ్తున్నారా? అని వివరణ అవడిగితే చెబుతాను కదా. పార్టీ మారాలనుకుంటే నాయకులు, కార్యకర్తలతో మాట్లాడతా. లేనిపోని అపోహలను ప్రజల్లోకి తీసుకెళ్లవద్దు అని కోరారు.













