హస్తం గూటికి మాజీ ముఖ్యమంత్రి!
మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పల్లంరాజు కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని కిరణ్‌కుమార్‌రెడ్డిని పల్లంరాజు కోరారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసి బయటకొచ్చారు. ఆ తర్వాత సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకొని 2014 ఎన్నికల్లో పరాయజం పాలయ్యారు. అప్పట్నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించకుండా ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవల కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు టీడీపీలో చేరారు. కిరణ్ కూడా టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కిరణ్‌కుమార్ దారి ఎటువైపు ఉంటుందో వేచి చూడాలి.













