ఇఫ్తార్ విందులో చంద్రబాబు
నెల రోజులు ఉపవాసం ఉండి, భక్తి శ్రద్ధలతో దేవుడ్ని ఆరాధించే ముస్లిం సోదరులకు అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలసి ప్రార్థనలు చేశారు. చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ముస్లిం మత పెద్దలు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పవిత్ర మాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌బాబు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.













