జీపీఎస్ రద్దు చేయకుంటే.. రానున్న ఎన్నికల్లో
జీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో ఉద్యోగులు విజయనగరం కలెక్టరేట్ వద్ద జీపీఎస్ బిల్లు ప్రతులను దగ్ధం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఓటేసి తప్పు చేశామంటూ ఉద్యోగులు మోకాళ్లపై కూర్చుని చెప్పులతో చెంపలను కొట్టుకున్నారు. ఓపీఎస్ విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులను మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వం జీపీఎస్ విధానాన్ని రద్దు చేయకుంటే రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగినబుద్ధి చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.













