ఏపీ ఎన్నికల కమిషనర్ తొలగింపు
ఆంధప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తొలగిస్తూ ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఎస్ఈసీ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గవర్నర్ ఆమోదం లభించడంతో ఆర్డినెన్స్‌పై ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజా నిబంధనల ప్రకారం రమేశ్‌కుమార్ పదవీకాలం ముగిసింది. దీంతో ఆయన్ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.













